MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

కానుమోలు ఆయుర్వేద ఆసుపత్రిని పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ

  • September 16, 2026
  • 1 min read
కానుమోలు ఆయుర్వేద ఆసుపత్రిని పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ

కానుమోలు (కృష్ణా జిల్లా):

కానుమోలులోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, మౌలిక వసతులపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.

ఈ సందర్భంగా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ కె. వాహిని ఆసుపత్రి సేవలను కలెక్టర్‌కు వివరించారు. దేశంలోనే తొలి ఆయుష్ సోలార్ డిస్పెన్సరీగా గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ప్రత్యేకంగా పంచకర్మ చికిత్సలు, యోగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కేరళ నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన ఆయుర్వేద మందుల ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందుతోందని పేర్కొన్నారు.

అలాగే, ఆసుపత్రి ప్రాంగణంలో పెంచుతున్న 40 రకాల మూలికా మొక్కలు, ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా అమలు చేస్తున్న బయోమెడికల్ వ్యర్థాల కలర్ కోడింగ్ నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ (రైన్‌వాటర్ హార్వెస్టింగ్) విధానాలను వైద్యాధికారి కలెక్టర్‌కు చూపించారు.

వైద్యశాలను అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తూ, రోగులకు నాణ్యమైన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నందుకు వైద్యాధికారి డాక్టర్ కె. వాహినితో పాటు సిబ్బందిని కలెక్టర్ డి.కే. బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు.

About Author

SSN