పెరికేడు అంగన్వాడీని పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
గన్నవరం:
పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని తల్లిదండ్రులు ప్రతిరోజూ గమనిస్తూ ప్రోత్సహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం గన్నవరం ప్రాజెక్టు, కానుమోలు సెక్టార్ పరిధిలోని పెరికేడు అంగన్వాడీ ప్రీ-ప్రైమరీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చిన్నారుల ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్మెంట్ (ECD) అంచనా వేసేందుకు ‘నవచేతన’ యాప్‌లో నిర్వహిస్తున్న ఏఐ (AI) ఆధారిత స్క్రీనింగ్ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. చిన్నారులతో నేరుగా ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు.
అనంతరం తల్లులతో మాట్లాడిన కలెక్టర్, పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ఆల్ఫాబెట్లు, సంఖ్యలు, రంగులు వంటి అంశాలను రోజువారీగా నేర్పిస్తూ వారి పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఐ. విమల, సీడీపీఓ మంగ, సూపర్వైజర్ కే. శాంతి శిరీష తదితరులు పాల్గొన్నారు.

