MachilipatnamLocal News
September 23, 2026
మచిలీపట్నం

గాంధీనగర్‌లో ఘనంగా వినాయక లడ్డూ వేలం: ₹22,300లకు దక్కించుకున్న భక్తులు

  • September 23, 2026
  • 1 min read
గాంధీనగర్‌లో ఘనంగా వినాయక లడ్డూ వేలం: ₹22,300లకు దక్కించుకున్న భక్తులు

మచిలీపట్నం:

స్థానిక గాంధీనగర్, నరసింహనగర్‌లో శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో బుధవారం స్వామివారి ప్రసాదం లడ్డూ వేలం పాటను అత్యంత వైభవంగా నిర్వహించారు. 

ఈ పోటీలో శ్రీమతి వనజ మరియు ఆమె కుమారుడు లోకేష్ కలిసి ₹22,300 రూపాయలకు లడ్డూను పాడి స్వామివారి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ చండీక ఫణి, సభ్యులు మెండు శశాంక్, నగిడి రత్నకుమార్, కేశన ధనుష్, జొన్నల సాయి కరుణ కుమార్ తదితరులు పాల్గొని విజేతలకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

About Author

SSN