MachilipatnamLocal News
October 8, 2026
జిల్లా

భారీ వర్షాల హెచ్చరిక: గురువారం కృష్ణా జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్

  • September 23, 2026
  • 1 min read

మచిలీపట్నం :

తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.  జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, గురువారం (సెప్టెంబర్ 24, 2026) జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల యాజమాన్యాల పాఠశాలలకు (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్) లోకల్ హాలిడే (సెలవు) ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఒక ప్రకటనలో తెలిపారు.

వర్షాల తీవ్రత దృష్ట్యా పాఠశాలల యాజమాన్యాలన్నీ ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులెవరూ ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని సూచించారు.

About Author

SSN