MachilipatnamLocal News
September 5, 2026
ఫీచర్స్

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి వార్షిక మహోత్సవం

  • February 1, 2026
  • 0 min read
ఘనంగా లక్ష్మీనరసింహస్వామి వార్షిక మహోత్సవం
మచిలీపట్నం:
 
 శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం కరగ్రహారం లక్ష్మీ నరసింహ యాగం, మహా పూర్ణాహుతి తో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారికి అభిషేకం సహస్రనామ పూజ, అష్టోత్తరం ను భక్తులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా నటేష్ బాబు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. 
పూజలు అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమారాధనకు పలు ప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. నారాయణరావు భక్తులకు స్వయంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శీలం భారతి భర్త శీలం బాబ్జి , ఆలయ కమిటీ సభ్యులు కట్ట పాండు, మట్ట నాగరాజు ,పరసా లక్ష్మణుడు, కరగ్రహారం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *