‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో మొక్క నాటిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
నిమ్మకూరు:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ – ఒక చెట్టు నాటండి, మెరుగైన రేపటిని పెంపొందించండి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మొక్క నాటారు. సోమవారం పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చని, పరిశుభ్రమైన జిల్లాను నిర్మించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బెల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

