డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
మచిలీపట్నం:
శనివారం 11వ జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి యుగంధర్ డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశము ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తమై ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇంటి పరిసరాలలో గాని ఇంటి చుట్టుప్రక్కలు గాని నీటి నిల్వలు లేకుండా చూసుకోవటమే డెంగ్యూ నివారణకు ముఖ్యమని ఇందుకు గానూ నీటి నిల్వలు చెక్ చేయడం, క్లీన్ చేయటం మరియు కవర్ చేయటం గురించి ఈ సందర్భంగా తెలియపరిచారు. జిల్లా మలేరియా అధికారి బి అరుణ్ కుమార్ మాట్లాడుతూ దోమలు కుట్టకూడదని దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వారానికి ఒకసారి ఇంటి పరిసరాలను డ్రైడేగా పాటించాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసు సిబ్బంది, ఆశ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

