MachilipatnamLocal News
May 24, 2026
పోలీస్ & లీగల్ డైరీ

మోటార్లను దొంగలించిన వ్యక్తికి 14రోజుల రిమాండ్

  • May 16, 2026
  • 0 min read
[addtoany]
మోటార్లను దొంగలించిన వ్యక్తికి 14రోజుల రిమాండ్

మచిలీపట్నం:

రాత్రి పూట తన మోటార్ సైకల్ పై చెరువుల వద్దకు వెళ్ళి మోటార్లను దొంగిలిస్తున్న బందరు మండలం, కంసాలిపాలెం గ్రామం, తాళ్ళపాలెం పంచాయితీకి చెందిన గడ్డం శ్రీనివాసరావు(38 సంవత్సరాలు) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందరు మండలం లోని సౌత్ సెక్టార్ లో గుండుపాలెం, కోన, తుమ్మలపాలెం గ్రామాల పరిధిలో గల రొయ్యల చెరువుల మీద ఎలక్ట్రికల్ మోటార్ లు దొంగిలించబడ్డాయి.

మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే ఏసుబాబు పర్యవేక్షణలో, బందరు తాలూకా ఎస్ ఐ లు జి రమేష్ బాబు, కే క్రాంతి కుమార్ లు వారి సిబ్బంది తో కలిసి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి, నిఘా పెట్టగా, శనివారం గుండుపాలెం గ్రామ ఊరి బయట స్కూటీ మోటార్ సైకల్ పై వెళుతున్న గడ్డం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి పై గ్రామాలలో చెరువుల మీద దొంగిలించిన 13మోటార్ లను రికవరీ చేయడం జరిగింది. అతనిని కోర్ట్ లో ప్రవేశ పెట్టగా అతనికి ది.29.05.2026వ తేదీ వరకు 14రోజుల రిమాండ్ విదించడంతో, అతనిని మచిలీపట్నం సబ్ జైలు కి తరలించారు. ఈ కేసులో ముద్దాయిని అదుపులోనికి తీసుకొని మోటార్లను రికవరీ చేసిన సిబ్బందిని కృష్ణ జిల్లా ఎస్పి వి.విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

About Author

SSN