మచిలీపట్నం డివిజన్ పరిధిలో బందరు మండలం సిరివెళ్లపాలెం గ్రామానికి చెందిన బత్తిన బాబురావు తపాలా బీమా పాలసీ తీసుకున్నారు. ఇటీవల ఆయన మరణించడంతో ఆ బీమా డెత్ క్లైమ్ మొత్తాన్ని నామిని అయిన తన భార్యకు శుక్రవారం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు చెక్కు రూపంలో ఆమెకు అందించారు.
ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు జీవిత బీమా పాలసీని తీసుకొని తమ జీవితాలను భద్రపరుచుకోవాలని అన్నారు. జీవిత బీమా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద లేకపోయినా జీవిత బీమా సొమ్ము ఆ కుటుంబ అవసరాలకు అక్కరకొస్తుందన్నారు. తపాలా బీమా సంస్థ లో భీమా జీవితానికి భరోసానిస్తుందన్నారు. తపాలా కార్యాలయంలో అందుబాటులో ఉన్న పలు బీమా పాలసీ లను వినియోగదారులకు వివరించారు. అదేవిధంగా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామం కు చెందిన అద్దేపల్లి కోటేశ్వరరావు మరణానంతరం డెత్ క్లైమ్ భీమ సొమ్మును ఆయన భార్య అర్జున కుమారికి చెక్కు రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.