బందరు లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
SSN
- April 20, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమై, అనంతరం నియోజకవర్గ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ మొటమర్రి బాబా ప్రసాద్, సీనియర్ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత, మహిళా నాయకురాలు లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు కి నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిన మహానేత అని పేర్కొన్నారు. పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో దూరదృష్టి, ప్రజాసేవలో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందంజలో నిలబెట్టి, అభివృద్ధి పథంలో నడిపించిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఆయన కృషి అపారమని వివరించారు. ప్రజల మన్ననలు పొందిన చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు కలగాలని, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కోనేరు సెంటర్‌లో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్‌లో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బన్నులు పంపిణీ చేశారు. అలాగే ఖలేగాన్‌పేట ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ఇన్‌చార్జులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, మైనార్టీ నాయకులు తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

