MachilipatnamLocal News
April 16, 2026
Uncategorized

బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే – ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, కొనకళ్ళ నారాయణరావు

  • April 11, 2026
  • 0 min read
[addtoany]
బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే – ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, కొనకళ్ళ నారాయణరావు
మచిలీపట్నం :
 
  బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే అని, మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కొనియాడారు. జ్యోతిరావు పూలే ద్వి శతాబ్ది జయంతి సందర్బంగా కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, కొనకళ్ళ నారాయణరావు, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి, గోపు సత్యనారాయణ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11 పూణేలో జన్మించిన సాధారణ కుటుంబంలో జన్మించారన్నారు. చిన్ననాటి నుంచే పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన వ్యక్తి అని అన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారన్నారు. దేశంలో బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించారన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని ధారపోశారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. తుది శ్వాస విడిచి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. బీసీలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తూ, సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించేలా ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు ఘనతేనన్నారు. బీసీల విద్యకు ప్రాధాన్యమిస్తూ బీసీ హాస్టళ్లను, గురుకులాలను వందల కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీసీ కుల వృత్తులకు వెన్నుదన్నుగా సీఎం చంద్రబాబు నిలిచారన్నారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జ్యోతిరావు పూలే ద్విశతాబ్ధి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తమకు, తమ పార్టీకి మహ్మాత్మా జ్యోతిరావు ఆశయ సాధనే లక్ష్యమని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా కార్యాలయ కార్యదర్శి, బత్తిన దాసు, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్, కుంచె నాని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కాసాని భాగ్య రావు, బచ్చుల బోసు బాబు, గోకుల శివ, తలారి సోమశేఖర్, కోస్తా మురళీకృష్ణ, ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, బచ్చుల అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్, మరకాని సమతా కీర్తి, ఎన్ వసంతకుమారి, వేమూరి శ్రీదేవి, కట్ట అంజిబాబు, యార్లగడ్డ సీతారామయ్య, వేముల కృష్ణారావు, గండికోట అంజిబాబు, నారగాని కృష్ణ, బడుగు ఉమాదేవి, చిల్లి ముంత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *