MachilipatnamLocal News
May 26, 2026
జిల్లా

“అమ్మ” అంటూ ఏడ్చిన మూడేళ్ల పాప…పక్కనే తెలియని నిద్రలో ఒక్కరోజు పసికందు

  • May 26, 2026
  • 0 min read
[addtoany]
“అమ్మ” అంటూ ఏడ్చిన మూడేళ్ల పాప…పక్కనే తెలియని నిద్రలో ఒక్కరోజు పసికందు

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన

మచిలీపట్నం:

మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆసుపత్రి వార్డులో “అమ్మ… అమ్మ…” అంటూ ఏడుస్తున్న మూడేళ్ల చిన్నారి… ఆమె పక్కనే ఏమి తెలియని నిద్రలో ఉన్న ఒక్కరోజు పసికందు… ఈ దృశ్యం అక్కడున్న వారందరి హృదయాలను కలచివేసింది.

ఆడబిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే బాలింత హరిత మృతి చెందడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. తల్లి ఇక లేరన్న విషయం తెలియని ఆ పసిపాప ప్రశాంతంగా నిద్రపోతుండగా… “అమ్మ ఎక్కడ?” అంటూ వెతుకుతున్న పెద్ద కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. “ఆ పాపకు ఊహ వచ్చేసరికి తల్లి లేదనే నిజాన్ని ఎలా భరిస్తుంది?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఒక్క క్షణంలో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమను కోల్పోవడం స్థానికులను తీవ్రంగా బాధకు గురి చేసింది. కుటుంబ సభ్యులు మాత్రం ఈ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే హరిత ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమా… లేక విధి రాతా అన్నది పక్కన పెడితే… ఈ ఘటన ఇద్దరు ఆడపిల్లల జీవితాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. తల్లి ఒడిని కోల్పోయిన ఆ చిన్నారుల దుస్థితి చూసి ఆసుపత్రి వాతావరణం అంతా విషాదంలో మునిగిపోయింది.

About Author

SSN