MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఆకట్టుకున్న హనుమాన్ చాలీసా పారాయణ

  • March 25, 2026
  • 0 min read
ఆకట్టుకున్న హనుమాన్ చాలీసా పారాయణ
మచిలీపట్నం :
 
         నగరంలోని చారిత్రాత్మక కోనేరు సెంటర్ లో పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. హిందూ భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. లక్ష్మీనివాసా మ్యూజికల్ అకాడమీ ఆర్గనైజర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను భక్తి సాగరంలో ముంచెత్తింది. ఉదయం పూజ, అర్చన కార్యక్రమాలు జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా కోనేరు సెంటర్లో రోజువారీ కార్యక్రమాలు వైభవో పేతంగా నిర్వహిస్తున్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *