MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

గాంధీ విద్యాలయంలో వేమూరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ

  • August 22, 2026
  • 0 min read
గాంధీ విద్యాలయంలో వేమూరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ

మచిలీపట్నం :

విద్యార్థులే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు వారి భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందని మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేమూరి రమేష్ శనివారం స్థానిక గాంధీ విద్యాలయంలో విద్యార్థులందరికీ  నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన గాంధీ విద్యాలయంలో వేమూరి సేవా ట్రస్ట్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ దేశం పట్ల బాధ్యత, భక్తి భావాలను పెంపొందించుకోవాలని సూచించారు.

మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదువుపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. పోక్సో చట్టం, మోటారు వాహనాల చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ఉన్నతమైన కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీ విద్యాలయం పాలకమండలి నిర్వాహకులు మాజేటి చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ వేమూరి సేవా ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

About Author

SSN