సామాజికాంశాలు స్పృశించేలా పరిశోధనలు – ఐఐటి (చెన్నై) ఆచార్యులు ధనవేల్
మచిలీపట్నం:
భాష, సంస్కృతి కు సంబంధించి చేసే పరిశోధనల్లో సామాజికాంశాలు స్పృశించేలా ఆలోచనలు చేయాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చెన్నై) ఆచార్యులు ఎస్ పి ధనవేల్ సూచించారు. శనివారం ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పరిశోధనా దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశోధకులు పాటించాల్సిన విధులు గురించి సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కె. రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి. వీర బ్రహ్మచారి, పరిశోధన, అభివృద్ధి విభాగం సమన్వయకర్త ఆచార్య మారుతి, విజయవాడ ఎన్ టి ఆర్ పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య దిలీప్, పలు విభాగాల పరిశోధకులు పాల్గొన్నారు.

