MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు

  • August 21, 2026
  • 0 min read
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు

మచిలీపట్నం:

మచిలీపట్నం ఆజాద్ రోడ్ లో వేంచేసియున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు శ్రావణమాస రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో సువాసినీలు అధిక సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తైదువులకు అమ్మవారి రూపు, కుంకుమ ప్రసాదంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు మామిడి మురళికృష్ణ, కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ పర్యవేక్షించారు.

About Author

SSN