హెచ్ఐవి పై గోడపత్రిక ఆవిష్కరణ
మచిలీపట్నం:
సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డి కే బాలాజీ హెచ్ఐవి పై సేవల గురించి, ప్రచురించిన, ఆరోగ్యకరదీపిక మరియు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.యల్.దయాకర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కృష్ణాజిల్లాలో అమలు చేస్తున్న Intensified IEC సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తద్వారా హెచ్ఐవి పై అవగాహన పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టిబి అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు మాట్లాడుతూ హెచ్ఐవి పై అవగాహనతో, హెచ్ఐవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పి కిరణ్, క్లస్టర్ ప్రీవియషన్ ఆఫీసర్ కాలింగ్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు

