MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమం – అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం

  • August 8, 2026
  • 0 min read
కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమం – అభివృద్ధిపై ఇంటింటి ప్రచారం

మచిలీపట్నం:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నిర్వహిస్తున్న “కూటమి రెండేళ్ల సంక్షేమం – అభివృద్ధి” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ పాల్గొన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం, పిల్లరిసెట్టిపాలెం, పోతేపల్లి పంచాయతీలోని 24, 27వ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

ప్రజా సంక్షేమం – రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గోపు సత్యనారాయణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి తలారి సోమశేఖర్, చిలకలపూడి పిఎసిఎస్ చైర్మన్ మేక గంగాధరరావు, కాటం మధు, కమ్మిలి మధు, అలాగే కాగిత సుబ్రహ్మణ్యం, కాగిత శేషు, కాసాని విష్ణు, మట్ట గణపతి, పామర్తి చిన్ని, కాగిత శ్రీరామ్, పృథ్వీ, ఈశ్వర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

SSN