నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్-2026 నిర్వహణకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మచిలీపట్నం:
నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్-2026ను పురస్కరించుకుని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్-2026 పరీక్ష ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ కోసం జూన్ 20, 21 తేదీల్లో కలెక్టరేట్లో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌కు 08672-252399 ఫోన్ నంబర్‌ను కేటాయించారు. జూన్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, జూన్ 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.
నీట్ రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఏవైనా సమాచారం, సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

