“పద్మ అవార్దుల” కొరకు ధరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నం :
మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి యొక్క సూచనల మేరకు రిపబ్లిక్ డే, 2027 సందర్బముగా ప్రకటించబడు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ అవార్దుల” కొరకు నామినేషన్లు ఎన్.టి.ఆర్, కృష్ణా జిల్లాల నుండి ఆహ్వానముకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
సదరు అవార్డులు 1.పద్మ విభూషణ్, 2.పద్మ భూషణ్, 3.పద్మశ్రీ అను మూడు విభాగములుగా ఉంటాయని, ఈ అవార్డులు పొందగోరు వారు దిగువ పేర్కొన్నరంగాలలో విశిష్ట సేవలు అందించిన అనుభవం ఉండాలన్నారు. కళలు, సాహిత్యము, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక / సాంఘిక సేవ, సైన్స్ ఇంజనీరింగ్, ప్రజా సంబంధాలు ,సివిల్ సర్వీసులు ,ట్రేడ్ ఇండస్ట్రీ ,పద్మ అవార్డుల కొరకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.పైన పేర్కొన్న రంగములో ఉత్తమ సేవ కనబరచిన వారు, వారియొక్క దరఖాస్తును ప్రభుత్వ వెబ్ సైట్ (రాష్ట్రీయ పురస్కార పోర్టల్) https://awards.gov.in నందు తేది.30-05-2026 లోగా నమోదు చేసుకొనవలసినదిగాను, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన అభ్యర్ధులు సదరు పూర్తి వివరములను జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయము నందు ఒక హార్డ్ కాపీని సమర్పించుటతో పాటు, కార్యాలయ మెయిల్ dywokrishna@yahoo.co.in నకు ఒక సాఫ్ట్ ప్రతిని కూడా పంపవలసినదిగా,పద్మ అవార్డుల దరఖాస్తుకు సంబంధించిన అవసరమగు ఇతర వివరములు భారత ప్రభుత్వ శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ నందు www.padmaawards.gov.in నందు పొందుపరిచారు. 2027 వ సంవత్సరపు రిపబ్లిక్ డే రోజున సదరు అవార్డులు భారత ప్రభుత్వముచే ప్రకటించబడునని డాక్టర్ కొల్లేటి రమేష్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా యువజన సంక్షేమ శాఖ స్టెప్, క్రిషి, విజయవాడ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

