MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

విద్యుత్ వినియోగదారుల అదాలత్

  • May 19, 2026
  • 0 min read
[addtoany]
విద్యుత్ వినియోగదారుల అదాలత్

మచిలీపట్నం :

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 21వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పోతేపల్లి రోడ్డు లో గల జ్యూవెలరీ ఫంక్షన్ హాల్ నందు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక వారి అధ్వర్యం లో విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు విద్యుత్ పర్యవేక్షణ ఇంజనీర్ శ్రీ. పి. రవీంద్ర బాబు గారు తెలిపారు.వినియోగదారులు విద్యుత్ సరఫరా లోపాలు, విద్యుత్ బిల్లులులో లోపాలు వంటి సమస్యలపై విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్ పర్సన్ శ్రీ ఎన్. విక్టర్ ఇమ్మానుయేల్ గారి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తామన్నారు.వారి తొపాటు సిజి ఆర్ ఎఫ్ సభ్యులు హాజరు అవుతారు. కృష్ణాజిల్లా పరిధిలోగల మచిలీపట్నం, ఉయ్యూరు మరియు గుడివాడ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

About Author

SSN