MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని మర్యాదపూర్వం కలిసిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం

  • May 19, 2026
  • 0 min read
[addtoany]
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని మర్యాదపూర్వం కలిసిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం

మచిలీపట్నం:

మంగళవారం ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిసి, నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ దూరదృష్టి, కార్యదీక్ష, ప్రజాసంకల్పాన్ని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లో యువశక్తికి నూతన దిశానిర్దేశం చేస్తూ, ప్రజల ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువెళ్తున్న ఆయన నాయకత్వం తెలుగు దేశం పార్టీకి మరింత బలాన్ని తీసుకువస్తోందని కొనియాడారు.

అలాగే కేడీసీసీ బ్యాంక్ ద్వారా రైతులు, మహిళలు, చిన్న వ్యాపారవేత్తల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థ ప్రగతి, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి నెట్టెం రఘురాం నారా లోకేష్ కి వివరించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి దిశగా కేడీసీసీ బ్యాంక్ చేస్తున్న కృషిని నారా లోకేష్ అభినందించారు.

About Author

SSN