MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

పంచాయతీరాజ్ పనులలో వేగంగా పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • May 20, 2026
  • 0 min read
[addtoany]
పంచాయతీరాజ్ పనులలో వేగంగా పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

జిల్లాలో చేపట్టిన పంచాయతీరాజ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో పంచాయతీరాజ్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 కోట్ల రూపాయలతో మంజూరైన 10 పీ ఎం జి ఎస్ వై రహదారులలో 7 రహదారులు పూర్తికాగా మిగిలినవి కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.అలాగే పీఎంజిఎస్ వై కింద 52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 వంతెన పనులు మంజూరు కాగా 3 పనులు జరుగుతున్నాయని వాటిని వేగవంతం చేయడంతో పాటు మిగిలిన పనులను కూడా వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలో 87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 66 పనులు సాస్కి పథకం కింద మంజూరయ్యాయని వాటికి సంబంధించి త్వరితగతిన టెండర్లు, ఒప్పందాలు పూర్తిచేసి పనులు త్వరగా చేపట్టాలన్నారు. అలాగే 27 కోట్ల రూపాయల వ్యయంతో 16 నాబార్డ్ రహదారి పనులు చేపట్టగా 11 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 5 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు.

పీఎం అభిమ్, జాతీయ ఆరోగ్య మిషన్, 15వ ఆర్థిక సంస్థ నిధులతో చేపట్టిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి పనిలోనూ నాణ్యత విధిగా పాటించాలని ప్రభుత్వ భవనాలు కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ఆకర్షణీయంగా నిర్మించాలన్నారు. ఇటీవల బల్లిపర్రు లో నిర్మించిన శానిటరీ కాంప్లెక్స్ చాలా బాగుందని కలెక్టర్ అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ ఇ రమణ రావు, ఈఈ సురేష్ బాబు, పలువురు డి ఇ లు ఏఈలు పాల్గొన్నారు.

About Author

SSN