MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి: కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మి

  • May 15, 2026
  • 0 min read
చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి: కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మి

మచిలీపట్నం:

బాధిత మహిళలకు, బాలికలకు అండగా ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకుని వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలని మచిలీపట్నం సీనియర్ సివిల్ జడ్జ్ మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక సుందరయ్య కాలనీలోని 38 వ వార్డు గ్రామ సచివాలయం పరిధిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో బాలికలను, మహిళలను ఉద్దేశించి న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్ వరలక్ష్మి, మచిలీపట్నం ప్రాజెక్ట్ సిడిపిఓ గ్లోరీ, వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అర్చిష్మా, మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ యోహాన్, చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ, ఎల్ ఏ డి సి న్యాయవాదులు, 39 వ వార్డు స్థానికులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN