MachilipatnamLocal News
September 5, 2026
ఫీచర్స్

మన చంద్రన్న – 2 పుస్తకం ఆవిష్కరణ

  • April 20, 2026
  • 1 min read
మన చంద్రన్న – 2 పుస్తకం ఆవిష్కరణ
చంద్రబాబు నాయుడు 2024 నుండి నేటి వరకు సాగిన పాలన, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుతున్నలపై అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం విజనరీ మన చంద్రన్న శీర్షికతో టి డి జనార్దన్ రచించిన మన చంద్రన్న – 2 పుస్తకం తొలి కాపీ ని ముఖ్యమంత్రి అందుకున్నారు.
 
         తొలుత సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను సీఎం నివాసంలో కలిసిన తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు తొండెపు దశరథ జనార్దన్ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. 
 
         అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీ జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో     తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు  మన చంద్రన్న – 2 పుస్తకాన్ని  ఆవిష్కరించారు. చంద్రబాబు  సంక్షేమ – అభివృద్ధి – సామాజిక న్యాయ కార్యక్రమాలను డిజిటలైజ్ చేయడం కోసం రూపొందించిన మన చంద్రన్న @mana-chandranna  యూట్యూబ్ ఛానెల్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య  ప్రారంభించారు. 
 
         మన చంద్రన్న – 2 పుస్తక రచనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికార భాషా సంఘం ఉపాధ్యక్షులు విక్రమ్ పూల, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ జాయింట్ సెక్రటరీ కాసరనేని రఘురామ్  హాజరైన ఈ కార్యక్రమంలో ఏ.పీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి, కమ్మ కార్పొరేషన్  బ్రహ్మం చౌదరి, గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ భీమనేని వందన దేవి, ఏపీ ఉమెన్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్ పర్సన్  పీతల సుజాత, ఏ.పీ.టీ.ఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ,  నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, ఉండవల్లి శ్రీ దేవి, కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య, టీడీపీ నాలెడ్జి సెంటర్ హెడ్  మాల్యాద్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, ఏ.పీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మౌలానా షేక్ ముస్తాక్అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
 
         గతంలో చంద్రబాబు జీవిత విశేషాలతో టీడీ జనార్ధన్ రచించిన మన చంద్రన్న పుస్తకం రికార్డు స్థాయిలో ముద్రితమైంది. ఈ పుస్తకం తెలుగుదేశం కార్యకర్తల శిక్షణలో పాఠ్య గ్రంథంగా ఉపయోగించ బడుతుంది. ఆ పుస్తకానికి కొనసాగింపుగా  మన చంద్రన్న – 2 పుస్తకాన్ని జనార్దన్ రచించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *