MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.1 కోటి విరాళం – మాజీ మంత్రి, కృష్ణా డీసీసీబీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం

  • November 10, 2026
  • 1 min read
రైతులకు అండగా కృష్ణా డీసీసీబీ రూ.1 కోటి విరాళం – మాజీ మంత్రి, కృష్ణా డీసీసీబీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం

అమరావతి/మచిలీపట్నం:

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలిచేందుకు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కృష్ణా డీసీసీబీ) తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బ్యాంకు చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం, రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ చైర్మన్ గన్నీ వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా డీసీసీబీ కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.1 కోటి  విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కృష్ణా డీసీసీబీ ప్రధాన ధ్యేయమని, కష్టకాలంలో రైతులకు అండగా నిలవడం సహకార బ్యాంకింగ్ వ్యవస్థ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కష్టాల్లో ఉన్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత” అని ఆయన వెల్లడించారు.

రైతుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన కృష్ణా డీసీసీబీ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాంను, బ్యాంకు ఉన్నతాధికారులను, సిబ్బందిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సహకార బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కృష్ణా డీసీసీబీ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

About Author

SSN