MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

రైతులకు, రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం!

  • November 10, 2026
  • 1 min read
రైతులకు, రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం!

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో రేషన్ కార్డుదారులు మరియు రైతులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 10 రైతు బజార్లు, 30 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా బీపీటీ (BPT), కేఎన్ఎం (KNM) రకాల బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరల ప్రకారం బీపీటీ బియ్యం కిలో రూ. 49, కేఎన్ఎం బియ్యం కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి కుటుంబానికి 26 కిలోల ప్రత్యేక ప్యాకింగ్‌తో ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

ఈ ప్రత్యేక విక్రయాల ద్వారా ఇప్పటివరకు 17,340 మంది రేషన్ కార్డుదారులకు 1,615.65 క్వింటాళ్ల బీపీటీ బియ్యం, 1,769.57 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 1,959 మంది వినియోగదారులకు 451.10 క్వింటాళ్ల కేఎన్ఎం బియ్యం, 68.90 క్వింటాళ్ల బీపీటీ బియ్యం కలిపి మొత్తం 520 క్వింటాళ్ల బియ్యాన్ని అందించినట్లు వెల్లడించారు.

రైతు బజార్లు, రైస్ మిల్లుల కౌంటర్ల వద్ద సరిపడా బియ్యం నిల్వలు సిద్ధంగా ఉంచామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విక్రయాలు నిర్వహించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

About Author

SSN