కృష్ణా జిల్లాలో రెండు రోజుల పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు పాక్షికంగా రద్దు: జిల్లా ప్రజారవాణా అధికారి
మచిలీపట్నం:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామపురం గ్రామంలో సెప్టెంబర్ 29వ తేదీ (మంగళవారం) నాటి “పల్లె పండుగ 3.0” కార్యక్రమం నేపధ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో (సోమవారం, మంగళవారం) ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు అధిక శాతం అందుబాటులో ఉండవని జిల్లా ప్రజారవాణా అధికారి (DPTO) కొడమంచిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభకు కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం మరియు ఉయ్యూరు డిపోల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు బస్సులను కేటాయించారు.
ఈ కారణం వల్ల ఆర్టీసీ బస్సులు అధిక శాతం అందుబాటులో ఉండవని, ప్రయాణీకులు, విద్యార్థులు మరియు ఉద్యోగులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని, ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణీకులకు కలిగిన ఈ తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

