MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

‘మీ కోసం’ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా: కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రకటన

  • October 17, 2026
  • 1 min read

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ / మీకోసం) కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ‘మీకోసం’ ప్రోగ్రామ్ నిర్వహించబడదని అధికారులు వివరించారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి యధావిధిగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపారు. కావున ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టరేట్ అధికారులు ప్రకటనలో కోరారు.

About Author

SSN