MachilipatnamLocal News
September 23, 2026
మచిలీపట్నం

ఇంగ్లీష్ పాలెం/బచ్చుపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

  • September 23, 2026
  • 1 min read
ఇంగ్లీష్ పాలెం/బచ్చుపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

మచిలీపట్నం:

స్థానిక ఇంగ్లీష్ పాలెం / బచ్చుపేట కోకా వారి వీధిలో  వినాయకుని పందిరి వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కమిటీ సభ్యులు అడపా వినయ్, కడవల వెంకటేష్ మరియు కడవల ప్రభుల ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.

స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన ఈ అన్నదానంలో స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.

About Author

SSN