MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

మోపిదేవిలో రూ. 24 లక్షల స్త్రీ నిధి నిధుల దుర్వినియోగం: బుక్ కీపర్‌పై క్రిమినల్ చర్యలకు ఆర్.టి.ఐ కార్యకర్తలు డిమాండ్

  • September 7, 2026
  • 1 min read
మోపిదేవిలో రూ. 24 లక్షల స్త్రీ నిధి నిధుల దుర్వినియోగం: బుక్ కీపర్‌పై క్రిమినల్ చర్యలకు ఆర్.టి.ఐ కార్యకర్తలు డిమాండ్

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, మోపిదేవి-1 వి.ఓ పరిధిలోని డ్వాక్రా సంఘాల స్త్రీ నిధి నిధుల్లో భారీ అక్రమాలు జరిగాయని, బాధ్యురాలైన బుక్ కీపర్‌పై వెంటనే క్రిమినల్ మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆర్‌.టి.ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

మోపిదేవి-1 వి.ఓ పరిధిలోని 11 డ్వాక్రా సంఘాలకు చెందిన సభ్యులు తమ స్త్రీ నిధి రుణాలకు సంబంధించి సుమారు రూ. 24 లక్షలు తిరిగి చెల్లించినప్పటికీ, బుక్ కీపర్ కరుణ ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు.

ఈ నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్‌.టి.ఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్, బేతపూడి జోగేశ్వరరావు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కి పి.జి.ఆర్.ఎస్ (P.G.R.S) ద్వారా ఫిర్యాదు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళల సొమ్మును పక్కదారి పట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మహిళలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

About Author

SSN