MachilipatnamLocal News
March 13, 2026
మచిలీపట్నం

రామానాయుడుపేట సెంటర్లో వైసిపి జనసేన వర్గాల మధ్య ఘర్షణ

  • March 13, 2026
  • 0 min read
[addtoany]
రామానాయుడుపేట సెంటర్లో వైసిపి జనసేన వర్గాల మధ్య ఘర్షణ
మచిలీపట్నం:
        గురువారం సాయంత్రం స్థానిక రామానాయుడుపేట సెంటర్లో జెండా దిమ్మ నిర్మాణం విషయంలో జనసేన వైసీపీ ల మధ్య వివాదం రాజుకుంది.
         వివరాల్లోకి వెళితే రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా దిమ్మ నిర్మించడానికి జనసేన కార్యకర్త సాయన శివయ్య ఏర్పాట్లు చేశారు. అయితే నేటి వరకు ఈ సెంటర్లో ఏ పార్టీకి సంబంధించిన జెండా లేదని, ఈ సెంటర్ అన్ని పార్టీలకి చెందిందని స్థానిక వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. దాంతో సెంటర్లో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది.
          ఘర్షణ మొదలవడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలని అక్కడి నుంచి పంపించి వేశారు. 
        అయితే ఇక్కడే జండా దిమ్మ కట్టి, జనసేన ఆవిర్భావ దినం, 14 వ తారీఖున జండా ఎగరవేస్తామని జనసేన నాయకులు, కార్యకర్తలు పట్టుబడుతుంటే….  ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వమని వైసిపి కార్యకర్తలు అంటున్నారు . 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *