రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి
మచిలీపట్నం:
కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టాభి భవన్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు అందే శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన మహానేత, టెలికాం ,ఐటి రంగాలను అభివృద్ధి చేసి సాంకేతిక రంగాలలో దేశాన్ని నడిపిన నవభారత నిర్మాణ శిల్పి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లికోటి ప్రసాద్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లబోలు సామ్యూల్ ,అత్తర్, జమాని బేగం, గరికిపాటి శంకర్ రావు, సయ్యద్ ,నూరుద్దీన్, ప్రసాద్ ,చౌదరి, అబ్దుల్ రహమాన్, రియాజ్, అలీ ,అబ్బాస్ ,ముర్బర్ భాష ,వసంత నందిని తదితరులు పాల్గొన్నారు.

