MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తెచ్చాం: కృష్ణా జిల్లా DSO టి. శివరామప్రసాద్

  • November 6, 2026
  • 1 min read
ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తెచ్చాం: కృష్ణా జిల్లా DSO టి. శివరామప్రసాద్

* కిలో రూ.47 నుంచి రూ.82 వరకు ధరలు నిర్ణయం
* ప్రత్యేక కౌంటర్లలో ఏడు రకాల బియ్యం విక్రయాలు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టోకు, చిల్లర వర్తక దుకాణాల్లో ఏడు రకాల నాణ్యమైన బియ్యాన్ని విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) టి. శివరామప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాపారులు ముందుకు రావడంతో ఈ ప్రత్యేక విక్రయాలకు శ్రీకారం చుట్టామన్నారు.

వినియోగదారులకు ప్యాకింగ్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సర్కార్ నిర్ణయించిన నిర్దిష్ట ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. మార్కెట్‌లో అధిక ధరలు వసూలు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బియ్యం రకాలు – కిలో ధర వివరాలు:
* బీపీటీ 3291 (సోనా) – ₹66
* బీపీటీ 5204 (సాంబ) – ₹66
* కేఎన్ఎం – ₹66
* హెచ్‌ఎంటీ – ₹76
* ఆర్‌ఎన్‌ఆర్ – ₹76
* జై శ్రీరామ్ – ₹82
* ఎంటీయూ కాటన్ వెరైటీ – ₹47

వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వర్తకులందరూ ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.

About Author

SSN