పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవల సమయం పెంపు
మచిలీపట్నం:
మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు అమలు అవుతున్న ఆధార్ సేవలు ఇకపై ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ఆదివారాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మచిలీపట్నం డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ బి శ్రీనివాసరావు పాత్రికేయ సమావేశంలో తెలిపారు.
పోస్టాఫీసులో కేవలం రూ.600/- జమ చేసి POSB ఖాతా ప్రారంబిస్తే, మీకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) క్రింద రూ.2,00,000/- వరకు ప్రమాద బీమా రక్షణ 6 సంవత్సరాల పాటు లబిస్తుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 6 సంవత్సరాల అనంతరం ప్రతి 5 సంవత్సరాల కాలానికి కేవలం రూ.100/- చెల్లిస్తే, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన బీమా రక్షణ కొనసాగుతుందని బి శ్రీనివాసరావు తెలిపారు.

