MachilipatnamLocal News
September 25, 2026
జిల్లా

నౌకా నిర్మాణ కేంద్రం భూసేకరణకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం డిమాండ్

  • September 25, 2026
  • 0 min read
నౌకా నిర్మాణ కేంద్రం భూసేకరణకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం డిమాండ్

మచిలీపట్నం:

మచిలీపట్నం పోర్టు సమీపంలో ప్రతిపాదిత నౌకా నిర్మాణ కేంద్రం (షిప్‌యార్డ్) కోసం భూములు కోల్పోతున్న రైతులందరికీ వర్తించే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా సీపీఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు, మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గోవా షిప్‌యార్డ్ సంస్థకు 400 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, ₹8,000 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావించారు. పోర్టు విస్తరణ కోసం సేకరించే 1,400 ఎకరాలలోనే ఈ 400 ఎకరాలను కేటాయిస్తున్నారని తెలిపారు.

ఈ సేకరణ పరిధిలోకి వచ్చే భూములలో చిన్న, సన్నకారు రైతులకు చెందిన పట్టా భూములతో పాటు ఎస్సైన్డ్ భూములు, ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొన్నారు. జీవనాధారమైన ఈ భూములను కోల్పోతున్న రైతులకు తగిన న్యాయం చేయాలని, ఎస్సైన్డ్ భూములు మరియు సాగు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

About Author

SSN