MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

నగరంలో పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • May 14, 2026
  • 0 min read
[addtoany]
నగరంలో పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

నగరంలో వరద నీరు నిలబడకుండా పటిష్టమైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో మున్సిపల్ అధికారులు, కన్సల్టెన్సీ లతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం నగరంలో మురుగునీటి వ్యవస్థ పై రూపొందించిన చిత్రపటాన్ని పరిశీలించి, సుదీర్ఘంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో మురుగునీటి వ్యవస్థను బాగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుండి 68 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో నగరంలో ఎక్కడ కూడా వరద నీరు నిలబడకుండా జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీరు సజావుగా బయటకు పోయే మార్గం ఏర్పాటు చేయాలన్నారు. అక్కడక్కడ అనుసంధానం కానీ మురుగునీటి కాలువలు అన్నింటిని సరిచేసి వరద నీరు అవుట్ఫాల్ పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని, పరిశీలన జరుగుతోందని కన్సల్టెంట్ కలెక్టర్కు వివరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ప్రవీణ్, కన్సల్టెంట్ అశోక్ రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *