MachilipatnamLocal News
October 25, 2026
జిల్లా

మెడికల్ బోర్డు సర్టిఫికేట్లు డీఈఓ ఆఫీస్ నందు పొందండి : కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు

  • October 24, 2026
  • 1 min read
మెడికల్ బోర్డు సర్టిఫికేట్లు డీఈఓ ఆఫీస్ నందు పొందండి : కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు నిబంధనలు-2025 అనుసరించి, పాఠశాల విద్యలో కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జి.ఓ.యం.ఎస్. నెం. 129, GA (SPF&MC) శాఖ, తేదీ 17.07.2026 ప్రకారం ప్రాధాన్యత వర్గాల కింద ప్రయోజనం పొందేందుకు అర్హత కోరిన ఉద్యోగులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య సంచాలకుల ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అక్టోబర్ 9 నుండి 16 వరకు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కాలవ్యవధిలో మెడికల్ బోర్డుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులకు సంబంధించి, మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ తమ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు.

కావున, డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు తక్షణమే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి తమ మెడికల్ బోర్డు సర్టిఫికేట్లను పొందుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About Author

SSN