MachilipatnamLocal News
October 25, 2026
మచిలీపట్నం

ముస్లిం మదర్సా పాఠశాలలో వేమూరి ట్రస్ట్ నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ  

  • October 24, 2026
  • 1 min read
ముస్లిం మదర్సా పాఠశాలలో వేమూరి ట్రస్ట్ నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ  

మచిలీపట్నం:

వేమూరి వెంకటసుబ్బయ్య కుదరవల్లి సీతారామయ్య వేమూరి వెంకట రమేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నం రాజుపేటలోని మదర్సా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన మదర్సా పాఠశాలల్లో వేమూరి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. 

ఎక్కువ మంది నిరుపేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను గుర్తించి, ట్రస్ట్ ప్రతినిధి వేమూరి వెంకట రమేష్ నగరంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజుపేటలోని ‘దారూల్ ఉలూమ్ అష్రఫియా’, ‘ఫైజానే హలీమి’ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు.

మానవ సేవే మాధవ సేవ: వేమూరి వెంకట రమేష్

ట్రస్ట్ చైర్మన్ వేమూరి వెంకట రమేష్ మాట్లాడుతూ.. అన్ని మతాల సారాంశం “మానవ సేవే మాధవ సేవ” అని, సమాజంలో అందరూ శాంతియుత సహజీవనంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. న్యాయవాది రాజేష్ మాట్లాడుతూ.. వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని, పెద్దల పేరు మీద ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి విద్యాదానం చేయడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రబ్బాని హలీమి, అమీర్, భాజాని, శ్రీనివాసు, సింగ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN