MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

లివర్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం – ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్‌తో క్యాన్సర్ ప్రమాదం

  • May 7, 2026
  • 0 min read
[addtoany]
లివర్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం – ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్‌తో క్యాన్సర్ ప్రమాదం

మచిలీపట్నం:

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఒకటిగా మారుతోందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీకి చెందిన క్లినికల్ డైరెక్టర్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ నవీన్ పోలవరపు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..

ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్ బి, సి వైరస్‌లు, అధిక మద్యపానం వంటి కారణాలతో లివర్ దెబ్బతింటోందన్నారు. లివర్ డ్యామేజ్‌ను “సైలెంట్ కిల్లర్”గా అభివర్ణిస్తూ, కాళ్లు వాపులు, పొట్ట ఉబ్బరం, లివర్ క్యాన్సర్ వంటి లక్షణాలు బయటపడే వరకు చాలా మందికి వ్యాధి ఉన్న విషయం తెలియదన్నారు. అప్పటికే వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్ బి, సి వైరస్‌లు చాలామందికి తెలియకుండానే శరీరంలో ఉండి క్రమేపీ లివర్‌ను దెబ్బతీస్తాయని తెలిపారు. ముందుగానే పరీక్షల ద్వారా గుర్తిస్తే వ్యాక్సినేషన్‌, చికిత్సలతో ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు.

అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. మలవిసర్జనలో మార్పులు, మోషన్‌లో రక్తం పడటం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

కొలనోస్కోపీ ద్వారా పేగుల్లోని పాలిప్స్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి తొలగించడం ద్వారా పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. పాశ్చాత్య దేశాల్లో కొలనోస్కోపీ అవగాహన పెరగడంతో పెద్దప్రేగు క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గాయని వివరించారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ 2000పడకలు తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో అనుభవఙ్ఞులైనై వైద్య సిబ్బంది తో అందు బాటు ధరల లో వైద్యం అందిస్తోంది ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ చంద్ర శేఖర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *