MachilipatnamLocal News
July 19, 2026
జిల్లా

జిల్లా పరిషత్‌లో ఉద్యోగులకు పదోన్నతులు

  • July 4, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా పరిషత్‌లో ఉద్యోగులకు పదోన్నతులు

ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా.. 26 మంది ఆఫీస్ సబార్డినేట్లకు ల్యాబ్, లైబ్రరీ, రికార్డ్ అసిస్టెంట్లుగా ప్రమోషన్

మచిలీపట్నం:

జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జె. అరుణ, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు మంజూరు చేస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. అలాగే 26 మంది ఆఫీస్ సబార్డినేట్లను ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతి కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు పదోన్నతి పొందిన ఉద్యోగులను అభినందించి, కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, సీఈఓతో పాటు జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author

SSN