MachilipatnamLocal News
July 19, 2026
మచిలీపట్నం

ఇంటర్నేషనల్ యోగా చాంపియన్ఆనంద్ భారతదేశానికే గర్వకారణం – కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ

  • June 30, 2026
  • 1 min read
[addtoany]
ఇంటర్నేషనల్ యోగా చాంపియన్ఆనంద్ భారతదేశానికే గర్వకారణం – కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ

మచిలీపట్నం:

భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని వేలాదిమంది యోగసాధకులకు నిత్యం యోగా శిక్షణ ఇస్తున్న అంతర్జాతీయ యోగా చాంపియన్ ఆనంద్ దేశానికే గర్వకారణమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. మంగళవారం ఉదయం ఇంటర్నేషనల్ యోగా చాంపియన్ ఆనంద్ ని కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ, వారి నాన్న గారు కృష్ణయ్య శెట్టి తో కలిసి పుష్ప గుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మచిలీపట్నం గాంధీనగర్ లోని వాకర్స్ అసోసియేషన్ హాలు లో యోగా శిక్షణ కు ఆనంద్ ప్రత్యేక అతిథిగా హాజరై, సభ్యులకు అడ్వాన్స్డ్ యోగా శిక్షణ ఇచ్చారు. యోగ సాధన లో సంపూర్ణ ఫలితాల కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం సాధించడానికి కావలసిన మెళకువలు నేర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని, విజయం సాధించి గోల్డ్ & సిల్వర్ మెడల్స్ పొంది కర్నాటక రాష్ట్రం లోని బీదర్ గ్రామంలో ఉంటూ ఇండియా లోనే కాకుండా విదేశాల్లోని వేలాది మంది యోగ సాధకులకు నిత్యం యోగ శిక్షణ ఇస్తూ, వారంతా పోటీల్లో విజేతలుగా నిలిచి, మెడల్స్ సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్న ఆనంద్ భారతదేశానికే గర్వకారణం అని అభినందించారు. అనంతరం ఆనంద్ మరియు జాతీయ స్థాయి యోగా గోల్డ్ మెడలిస్ట్ బికె రాముడు ని యోగా సభ్యులు అందరూ కలిసి పుష్ప గుచ్చాలు, శాలువాలు, మెమెంటోలు, నూతన వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో జాతీయ యోగా విజేతలు బికె రాముడు, శీలం రమేష్, వాకర్స్ అసోసియేషన్ ట్రస్టీ యారా జగన్ మోహన్ రావు, యోగా గురువులు గురునాధబాబు, మహాలక్ష్మీ, తేజస్వీ కుమార్ , చింతయ్య, మానేపల్లి శ్రీనివాస్, వడ్డి శ్రీనివాస్, ఆర్ డి ప్రసాద్, మిరియాల సురేష్, రేఖా రంజిత, రాజకుమారి, శేషావతి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN