MachilipatnamLocal News
May 25, 2026
మచిలీపట్నం

ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఖాతాదారుల సమావేశం

  • May 25, 2026
  • 1 min read
[addtoany]
ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఖాతాదారుల సమావేశం

మచిలీపట్నం:

ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ మచిలీపట్నం శాఖ సభ్యుల సమావేశం వేడుక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ మన్నె నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, సభ్యుల సహకారంతో సొసైటీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం సంస్థ ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 44 శాఖలతో విజయవంతంగా సేవలందిస్తోందని తెలిపారు. సంస్థ టర్నోవర్ రూ.5,136 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.వైస్ చైర్మన్ పి.ఆర్.వి.పి.ఎస్. రాజు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సభ్యుల మద్దతుతో సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ఎ.కోటేశ్వరరావు సమావేశంలో పాల్గొని సంస్థ సేవలను అభినందించారు. సభ్యులు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్ పి.శ్రీకాంత్ మాట్లాడుతూ 173 కోట్లు టర్నోవర్తో మచిలీపట్నం బ్రాంచ్ కొనసాగుతున్నదని తెలియజేశారు.ఈ సమావేశంలో బ్యాంకు సిబ్బంది, పలువురు సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

About Author

SSN