రూ. 1 కే ఉచిత కాలింగ్, రోజుకు 1GB డేటా.. బిఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ ‘ఫ్రీడమ్ 2.0’!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు మైండ్ బ్లాకింగ్ ఆఫర్తో ముందుకొచ్చింది. టెలికాం రంగంలో తన నెట్వర్క్ను మరింత విస్తరించడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ 2.0’ పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ. 1 చెల్లిస్తే చాలు.. కొత్త సిమ్ కార్డ్తో పాటు ఉచిత రీఛార్జ్ ప్రయోజనాలను పొందవచ్చు.
‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్ కింద అక్టోబర్ 12వ తేదీ వరకు కేవలం రూ. 1 చెల్లించి కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ పొందవచ్చు లేదా ఇతర నెట్వర్క్ నుంచి అక్టోబర్ 08వ తేదీ వరకు బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ (MNP) అవ్వవచ్చు. ఈ ఆఫర్ ద్వారా రూ. 1 కే 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ 1 GB హైస్పీడ్ డేటా, అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలు పూర్తిగా ఉచితంగా అందుతాయి.
ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మరియు ఇతర నెట్వర్క్ల నుంచి పోర్ట్ అయ్యేవారికి (MNP) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ఉపయోగిస్తున్న పాత వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు. ఆసక్తి గల వినియోగదారులు తమ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా గుర్తింపు పొందిన రిటైలర్ షాప్ను సందర్శించి, అవసరమైన కేవైసీ (KYC) పత్రాలను సమర్పించి కేవలం రూ. 1 చెల్లించి ఈ ఆఫర్ను పొందవచ్చు. అక్టోబర్ 12 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

