మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘ సమావేశం
మచిలీపట్నం :
రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం మరింత ముందుకు సాగేలా జిల్లా స్థాయి సలహాదారుల కమిటీ లు నియమించాలని రాష్ట్ర అధ్యక్షుడు సి హెచ్ రవికుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్. ఆర్యవైశ్య జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి ప్రతినిధులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద జర్నలిస్టుల కుటుంబాలకు విద్య,వైద్యం రంగాల్లో చేయూత లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యతగా ముందుకు సాగాలని జిల్లా కో ఆర్డినేటర్ లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలపాటి రవికుమార్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ప్రతి రెండు నెలలకోసారి సమావేశాలు నిర్వహించి సంఘం సభ్యులకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు.సంఘం కోశాధికారి పూసర్ల రాజా మాట్లాడుతూ రాస్తాం మొత్తం పర్యటించి మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
సేవా కార్యక్రమాలు కమిటీ కో ఆర్డినేటర్ గా కృష్ణారావు
సంఘం సేవా కార్యక్రమాలు కమిటీ కో ఆర్డినేటర్ గా ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన కృష్ణారావు ను రాష్ట్ర కమిటీ ప్రకటించింది.విజయనగరం జిల్లా అదనపు కో ఆర్డినేటర్ గా పీ.ఎస్ కుమార్ ను ప్రకటించారు. మచిలీపట్నం అవోపా అధ్యక్షుడు దేసు రమణ మూర్తి ,పులవర్తి శ్రీనివాస్ లు జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. వాసవి క్లబ్ రాష్ట్ర స్థాయి ప్రతినిధి యందూరి సురేష్ జర్నలిస్టులను సన్మానించి బందరు లడ్డూ అందజేశారు.
వేద పండితులు ఆశీర్వచనం..
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు మామిడి మురళీ కృష్ణ,ఉపాధ్యక్షుడు సామా కాంతారావు ల ఆద్వర్యంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి ఘనంగా సన్మానించారు.
శుభాకాంక్షలు తెలిపిన మహిళా నాయకులు ..
ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా నాయకులు తుమ్మలపల్లి విశాలాక్షి, మాటూరి శ్రీలక్ష్మీ,సి హెచ్ వాసవి దేవి,సామా అపర్ణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి అమ్మవారి ప్రార్థనా గీతం ఆలపించారు.
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు…
జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సన్నిధి సాయి శ్రీనివాస్, శ్రీ లక్ష్మీ నృసింహ సోమయాజి వైశ్య సమాజం ప్రధాన కార్యదర్శి ఉడత్తు కిషోర్,మాజీ కార్పొరేటర్ అన్నం ఆనంద్ , పచారీ వర్తక సంఘం అధ్యక్షుడు చక్కా అనిల్ కుమార్ ,ప్రముఖ ఆధ్యాత్మిక సేవకుడు ఊర రామాంజనేయులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడత్తు శ్రీనివాసరావు,మాటూరి పూర్ణ,సామా కిషోర్, కొప్పర్తి రవిశంకర్,పెరుమాళ్ళ మురళీ తదితరులు ఉన్నారు.
ఘన సన్మానం..
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ను తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ రవి కుమార్, సుబ్బారావు లు , మాజీ కార్పొరేటర్ అన్నం ఆనంద్, ఉడత్తు శ్రీనివాసరావు, మహిళా విభాగం నాయకులు,వివిధ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

