MachilipatnamLocal News
September 22, 2026
మచిలీపట్నం

ఏపీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలి

  • September 22, 2026
  • 1 min read

– ప్రముఖ వైద్యులు డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య పిలుపు

మచిలీపట్నం :

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో 18 సంవత్సరాలు పైబడిన బ్రాహ్మణ మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి సమాజ బలాన్ని పెంచుకోవాలని ప్రముఖ వైద్యులు, బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకులు డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య పిలుపునిచ్చారు.

బుధవారం మచిలీపట్నంలో డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య ఏపీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన సభ్యత్వ బాండ్ మరియు ఐడెంటిటీ కార్డును బ్రాహ్మణ సంక్షేమ నిగమం (వెల్ఫేర్ కార్పొరేషన్) రాష్ట్ర డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గోర్తి శ్రీనివాస్ అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న ఈ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సొసైటీలో సభ్యత్వం పొందిన వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సొంతంగా వ్యాపారాలు చేసుకుని కుటుంబాలను పోషించుకునేందుకు వివిధ పథకాల కింద ప్రభుత్వం రుణ సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు.

బ్రాహ్మణులందరూ ఇందులో సభ్యులుగా చేరి సమాజ ఐక్యతను చాటడంతో పాటు, హక్కులను కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

About Author

SSN