MachilipatnamLocal News
July 21, 2026
మచిలీపట్నం

బందరు సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్ధులకు మంత్రి కొల్లు రవీంద్ర సన్మానం

  • May 6, 2026
  • 0 min read
[addtoany]
బందరు సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్ధులకు మంత్రి కొల్లు రవీంద్ర సన్మానం

మచిలీపట్నం :

పట్టుదల, కష్టబడే తత్వం ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో చదువుకుని, పది, ఇంటర్ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్ధులకు మంత్రి కొల్లు రవీంద్ర సన్మానించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ.. ప్రైవేట్ స్కూళ్స్ కు ధీటుగా మార్కులు సాధించడం అభినందనీయం అని అన్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఎక్కడున్నా, ఎన్ని అవాంతరాలున్నా మనల్ని ఎవరూ ఆపలేరని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు మరోసారి నిరూపించారు. ఇదే పట్టుదల, ఇదే కష్టబడే తత్వంతో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించే వరకు విశ్రమించొద్దని విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *