MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఏపీసీపీడీసీఎల్ సీఎండీ

  • October 27, 2026
  • 1 min read
తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఏపీసీపీడీసీఎల్ సీఎండీ

విజయవాడ:

రాష్ట్రంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతినే అవకాశం ఉందని, సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని తెలిపారు. emergency సమయాల్లో ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ రూమ్‌లు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రజలకు విద్యుత్ భద్రతా సూచనలు:
* రక్షణ చర్యలు: వర్షాలు, గాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
* జాగ్రత్తలు: తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. ఒరిగిన స్తంభాలు లేదా ప్రమాదకర స్థితిలో ఉన్న తీగలను చూస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.

అత్యవసర నంబర్లు:
విద్యుత్ సమస్యలు లేదా ప్రమాదాల నివారణకు టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించవచ్చు.

జిల్లాల వారీ కంట్రోల్ రూమ్ నంబర్లు:
* కృష్ణా: 6281709355
* ఎన్టీఆర్: 9440817561
* గుంటూరు: 9440817526
* బాపట్ల: 9281413774
* ప్రకాశం: 9440817491
* పల్నాడు: 7661019447
ప్రజలందరూ విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఏపీసీపీడీసీఎల్ విజ్ఞప్తి చేసింది.

About Author

SSN