MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

అపర కర్మల భవన స్థలానికి బ్రాహ్మణ సంఘాల వినతి

  • September 15, 2026
  • 1 min read
అపర కర్మల భవన స్థలానికి బ్రాహ్మణ సంఘాల వినతి

మచిలీపట్నం : 

కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణులకు అపర కర్మల భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి బ్రాహ్మణ సేవా సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఈ మేరకు వినతి అందించారు.

బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్ గన్నవరంలో స్థల కేటాయింపును సిఫార్సు చేస్తూ రాసిన లేఖను కలెక్టర్‌కు సమర్పించినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ తెలిపారు.

ప్రధానాంశాలు:

 * స్థల పరిశీలనకు హామీ: రాష్ట్రవ్యాప్తంగా అపర కర్మల నిర్వహణకు బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్నవించగా, గన్నవరం నియోజకవర్గంలో త్వరలోనే స్థలాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు.

 * ఎమ్మెల్యే సానుకూలత: ఈ విషయమై గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లగా, భవన నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేయిస్తానని చైర్మన్ బుచ్చి రాంప్రసాద్‌తో చెప్పినట్లు నాయకులు తెలిపారు.

 * పట్టాభి సీతారామయ్య స్మారక భవనం: ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంపై కలెక్టర్‌ను కోరగా, బ్యాంకు అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే రూపకల్పన పూర్తి చేస్తామని వెల్లడించారు.

 * క్రెడిట్ సొసైటీ పథకాలు: నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు కె.వి.ఆర్. కిషోర్, నాయకులు ఎన్. మోహన్, ఎస్. రవికుమార్, వి.వి. కృష్ణ మోహన్, మచిలీపట్నం బ్రాహ్మణ సేవా సంఘం నాయకుడు మోపర్తి సుబ్రమణ్యం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గొర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN