MachilipatnamLocal News
April 29, 2026
మచిలీపట్నం

అధికారుల నిర్లక్ష్యం పై అసంతృప్తి

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
అధికారుల నిర్లక్ష్యం పై అసంతృప్తి
మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:
 
        మచిలీపట్నం నగరపాలక సంస్థ సాధారణ సమావేశం శనివారం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజలకు సంబంధించిన పలు సమస్యలపై కార్పొరేటర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు. 
         నగరంలోని తాగునీరు సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్పొరేటర్లు సూచించారు. నగర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అధికారులను ఆదేశించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *